ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. గ్రామస్థుల ఆందోళన - ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి వార్తలు

ఒకే కుటుంబంలో ముగ్గురు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం ఆ గ్రామస్థుల్లో కలకలం రేపుతోంది. అదే కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా సోకిందని తెలియడం వారి ఆందోళనను మరింత పెంచింది. అయితే చనిపోయిన ముగ్గురు మృతదేహాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎలాంటి నమూనాలు సేకరించలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిన ఉదంతమిది..!

రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. గ్రామస్థుల ఆందోళన
రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. గ్రామస్థుల ఆందోళన

By

Published : Jul 12, 2020, 11:09 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఒకే కుటుంబంలో ముగ్గురు... రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో అక్కడి ప్రజల్లో కలవరం నెలకొంది. విడపనకల్లు మండలానికి 64 ఏళ్ల వృద్ధురాలు ఈనెల 2న చనిపోయింది. ఆ కుటుంబం బాధలో ఉండగానే... ఈనెల 3న ఆమె మరిది మరణించాడు. ఈ విషాదం నుంచి కుటుంబసభ్యులు తేరుకోకముందే.... వృద్ధురాలి కుమారుడు ఈనెల 10న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిది ఉమ్మడి కుటుంబం.

వీరంతా గత నెలాఖరులో వజ్రకరూరు మండలంలోని సమీప బంధువుల పెళ్లికి హాజరై వచ్చాక... వదిన, మరిది అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యసిబ్బంది పేర్కొన్నారు. వీరి మృతదేహాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎలాంటి నమూనాలు సేకరించలేదు. వృద్ధురాలి కుమారుడి మృతదేహం నుంచి నమూనాలు సేకరించగా ఫలితం రావాల్సి ఉంది. ఇదే తరుణంలో.. ఆ కుటుంబ సభ్యుల్లోని ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details