అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి వద్ద ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టించింది. ఇంటి పక్కవారు ఇచ్చిన సమాచారంతో.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను గుర్తించారు. మడకశిరలో ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయిన అశ్వర్థప్ప అనే వ్యక్తి.. అతని ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి ఉంటున్నాడు.
ఇద్దరు చెల్లెళ్లతో పాటు విశ్రాంత బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య - today three members committed suicide in penugonda news update
![ఇద్దరు చెల్లెళ్లతో పాటు విశ్రాంత బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య penukonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11888197-714-11888197-1621920677071.jpg)
10:09 May 25
తిండి లేక ఆందోళనకు గురై ఆత్మహత్య!
4 రోజులుగా పనిమనిషి రాకపోవడంతో.. తిండి లేక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే వృద్ధాప్యం మీద పడటం.. కరోనా సమయంలో సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు వెల్లడించారని.. పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాల వద్ద కీటకాలు నాశనం చేయడానికి వినియోగించే మార్టిన్ మందు సీసాలు పడి ఉండటంతో.. ఆ మందు తాగి వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...