అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రాఘవమ్మపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు మృతి చెందాారు. ఇంకో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనంతలో రెండు ప్రమాదాలు... ఐదుగురు మృతి... - anantapur latest news

20:13 December 18
అనంతలో రెండు ప్రమాదాలు... ఐదుగురు మృతి...
బత్తలపల్లి నుంచి రాఘవమ్మపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజశేఖర్ అనే యువకుడిని.. వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతదేహాన్ని చూసేందుకు అదే ప్రాంతంలో ఉన్న శ్రీనివాసులు, శివమ్మపై అనంతపురం నుంచి కదిరి వైపు వెళ్తున్న లారీ దూసుకొచ్చింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి: