అనంతలో పెరిగిన కేసులు..అప్రమత్తమైన అధికారులు - corona cases in anantapuram news
అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం నుంచి మూడు రోజులుటు అమలులో ఉన్న పూర్తి లాక్డౌన్ను ఈరోజు కూడా పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పట్టణంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అనంతలో పూర్తి లాక్డౌన్
అనంతపురం జిల్లా కదిరిలో మూడో రోజు పూర్తి లాక్డౌన్ కొనసాగుతోంది. పట్టణంలో 165కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం మరో 13 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలింది. నగరంలో కొవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పూర్తి లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ కేసులు పెరుగుతుండటం సోమవారం కూడా లాక్డౌన్ పొడిగించినట్లు తహసీల్దార్ మారుతి తెలిపారు.