ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో మూడు పాజిటివ్ కేసులు నమోదు - ఉరవకొండ కరోనా వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర నుంచి ఇటీవల వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించారు.

ఉరవకొండలో మూడు పాజిటివ్ కేసులు నమోదు
ఉరవకొండలో మూడు పాజిటివ్ కేసులు నమోదు

By

Published : Jun 21, 2020, 7:37 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామానికి వారం కిందట మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ముగ్గురు వచ్చారు. ఆ కుటుంబంలోని ఇద్దరికి పాజిటివ్ రాగా వారితో సన్నిహితంగా ఉన్న గాంధీ బజార్ ఏఎన్ఎంకు కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వ్యాధి సోకిన వారిలో ఒకరు హోమ్ ఐసోలేషన్​లో ఉండగా ఇద్దరిని అనంతపురం ఎస్​కేయూ ఐసోలేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details