Children drowned: అనంతపురంలో విషాదం.. చెరువులో ముగ్గురు చిన్నారులు గల్లంతు - అనంతపురం జిల్లా అమడగూరు మండలం ఎగువతండాలో విషాదం వార్తలు
17:50 October 11
అమడగూరు మండలం ఎగువతండాలో ఘటన
బట్టలు ఉతకడానికి తల్లితో కలసి వెళ్లిన ముగ్గరు పిల్లలు చెరువులో పడిపోయిన ఘటన.. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు.. ముగ్గురు పిల్లలతో దుస్తులు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. అప్పటివరకు నీటిలో ఆడుకుంటున్న పిల్లలు.. హఠాత్తుగా చెరువులో మునిగిపోయారు. ఈ విషయాన్ని అక్కడున్న మహిళలు గమనించేలోపే వారు గల్లంతయ్యారు. వీరి కోసం గాలిస్తున్నారు. కానీ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి:
JAC MEETING: రేపు అమరావతి ఐకాస నేతల కీలక సమావేశం..భవిష్యత్ కార్యాచరణపై చర్చ