నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి నీటి సరదా చిన్నారుల ప్రాణం తీసింది. అనంతపురం హమాలి కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు ఇంటి నిర్మాణం కోసం చేపట్టిన నీటి గుంతలో పడి మృతి చెందారు. పాఠశాల అనంతరం ఇంటికి వచ్చిన పిల్లలు రిహాన్(5), ఆయాన్(3) దుర్గాప్రసాద్(5) ఆడుకోవడం కోసం వెళ్లి... నీటి గుంతలో పడ్డారు. ఎవరూ గమనించకపోవడంతో చిన్నారులు ప్రాణాలుకోల్పోయారు. ఆ వార్తను తట్టుకోలేక ఆసుపత్రి ఆవరణలో తలిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.