అనంతపురం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. గుంతకల్లు మండలంలో 25 పంచాయతీల్లో 2 ఏకగ్రీవం అవ్వగా.. మిగిలిన వాటిలో మొత్తం 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. 155 మంది వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
గుంతకల్లులోని 23 పంచాయతీల్లో ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 23 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఏర్పాట్లు పూర్తి
పోలింగ్ కేంద్రం వద్ద విధుల నిర్వహించే వారికోసం భోజన, నీటి సదుపాయాలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఎన్నికలు జరగనున్న 23 పంచాయతీల్లో 224 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని గుంతకల్లు డీఎస్పీ షర్పుద్దీన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబానికి చంద్రబాబు సాయం