అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆశానగర్లో నివాసం ఉండే మధుసూధన్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళాలను ధ్వంసం చేసిన దుండగులు లక్ష రూపాయల నగదుతో పాటు 4 తులాల బంగారు ఆభరణాలు, 30 వేలు విలువ చేసే పట్టుచీరలను దోచుకెళ్లారు. మధుసూదన్ గౌడ్ అనే వ్యక్తి హోటల్ నిర్వహించుకుంటూ పట్టణంలోని ఆశానగర్లో నివాసముంటున్నాడు. శనివారం రాత్రి తన ఇంట్లో ఒక్కడే ఉండడంతో ఇంటికి తాళాలు వేసి ఇంటి మిద్ధెపై నిద్రించాడు. ఇంటికి తాళాలు వేసి ఉండడం గమనించిన దొంగలు... ఇదే అదునుగా భావించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
గుత్తిలో దొంగల బీభత్సం...ఓ ఇంట్లో నగదు, బంగారం చోరీ - గుత్తిలో దొంగల బీభత్సం
గుత్తి పట్టణంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్ష రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.
గుత్తిలో దొంగల బీభత్సం...నగదు, బంగారం చోరి
మధుసూదన్ గౌడ్ నిద్రలేచి కిందకు వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని గుర్తించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.