ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటకకు చెందిన దొంగ.. అనంతపురంలో అరెస్ట్ - అనంతపురం తాజా వార్తలు

కర్ణాటకకు చెందిన దొంగ... సాదిక్ బాషాను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.

మసీదులో చోరికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
మసీదులో చోరికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

By

Published : Feb 2, 2021, 7:33 AM IST

కర్ణాటకకు చెందిన దొంగ.... సాదిక్ బాషా ను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఇతనికి నేర చరిత్ర ఉన్నట్టు తెలిపారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ప్రాంతానికి చెందిన సాదిక్ బాషా... 2008లో బ్యాంకులో పనిచేస్తూ ఖాతాదారుని నగదును తన ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ కేసులో మంగ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో జైలుకు వెళ్లి వచ్చాడు. కరోనా సమయంలోనూ.. బెంగళూరు సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గాలో దొంగతనానికి పాల్పడినట్లు వివరించారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం జిల్లాకు వచ్చి గతేడాది జులైలో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని దర్గాలో రూ.22 వేలు దొంగతనం చేశాడు. ఇతను జిల్లాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ రాఘవరెడ్డి.. సిబ్బందితో నగరంలోని లిటిల్ ఫ్లవర్ కళాశాల సమీపంలో తనిఖీలు చేశారు. అక్కడే.. నిందితుడిని పట్టుకున్నట్లు సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు. అతని నుంచి ఒక ఇనుప రాడ్డు, రూ.130 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోని రిమాండ్​కి పంపామన్నారు.

ABOUT THE AUTHOR

...view details