ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎం చోరీకి విఫలయత్నం - వజ్రాలపేట ఏక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీ

ఏటీఎంను పగులగొట్టి డబ్బు దోచేద్దాం అనుకున్నారు ఆ దుండగలు... అనుకున్నట్లే పని మెుదలుపెట్టారు. గ్యాస్ కట్టర్​తో ఏటీఎంను తెరవటానికి ప్రయత్నిస్తుండగా, సైరన్ మోగటంతో పరారయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

atm robbery
కాలిబూడిదైన కరెన్సీ నోట్లు

By

Published : Jan 16, 2020, 10:50 AM IST

Updated : Jan 16, 2020, 11:09 AM IST

కాలిబూడిదైన కరెన్సీ నోట్లు

అనంతపురం జిల్లా పెనుకొండ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కటర్​తో ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. హెడ్ ఆఫీస్​లో సైరన్ ​మోగటంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎంలో మంటలు గమనించి అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయలేని కారణంగా ఏటీఎంలోని నగదు పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం ఏటీఎంలో ఏడు లక్షల నగదు ఉంచినట్లు బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం సెలవు కావడంతో ఎంత మేరకు నగదు ఉపసంహరించుకున్నారు.. ఎంత మేరకు డిపాజిట్ చేశారు.. అన్న వివరాలు తేలాలంటే ఒక రోజు సమయం పడుతుందని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలకే ఏటీఎం వద్దకు వచ్చినా.. మంటలను అదుపు చేయడానికి బ్యాంకు వారు అనుమతి ఇవ్వని కారణంగా ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. ఘటనపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Jan 16, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details