అనంతపురం జిల్లా కదిరిలో పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉంటున్న కొటక్ మహేంద్ర బ్యాంక్ ఉద్యోగి బంగారు రాజు ఇంట్లో చోరీ జరిగింది. బంగారు రాజు విధులకు వెళ్లగా..ఆయన భార్య జ్యోతి, తల్లి బజార్ కి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన దొంగ.. ఇంటి వెనక వైపున కిటికిని తొలగించి లోనికి చొరబడ్డాడు. బీరువా తలుపులు పగలగొట్టి ... 5 తులాల బంగారం, 13 వేల రూపాయల నగదు అపహరించుకు వెళ్లాడు. అంగడికి వెళ్లిన అత్తా కోడలు ఇంటికి తిరిగి వచ్చిన విషయాన్ని గమనించిన దొంగ...యాజమానురాలు జ్యోతిని పక్కకు నెట్టి పరుగందుకున్నాడు. ఆమె కేకలు వేయటంతో.. కాలనీలోని కొందరు దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. వారికి దొరక్కుండా సమీపంలోని పొలాల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఇంటిని పరిశీలించి.. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
'కదిరిలో పట్టపగలే చోరీ..13 తులాల బంగారం అపహరణ' - 'కదిరిలో పట్టపగలే చోరీ..13 తులాల బంగారం అపహరణ'
పట్టపగలే చోరీ జరిగిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. 5 తులాల బంగారం, 13వేల రూపాయల నగదు ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.
కదిరిలో పట్టపగలే చోరీ
TAGGED:
Thief chori in kadiri