ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగ అరెస్టు... రెండు బైక్​లు, ఒక ఆటో స్వాధీనం - బైక్ దొంగను పట్టుకున్న పోలీసులు

అనంతపురం జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు బైక్​లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

thief arrested in anantapur district
దొంగ అరెస్టు... రెండు బైక్​లు, ఒక ఆటో స్వాధీనం

By

Published : Mar 18, 2021, 10:40 AM IST

అనంతపురంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే వ్యక్తిని ఒకటో పట్టణ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.1.60లక్షల విలువచేసే రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పరపల్లి ప్రాంతానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి.. ద్విచక్ర వాహనాలను దొంగిలించి తక్కువ ధరకు అమ్మాలని చూశాడు. సహచరులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దొంగను పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details