కియా మోటర్స్ పరిశ్రమ అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి తరలిపోవటానికి సిద్ధమైందని తెదేపా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. కియా పరిశ్రమ తరలిస్తున్న వార్తలు మీడియాలో రావటంపై అనంతపురం జిల్లా తెదేపా నేతలు స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కృషి వల్లనే కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు వచ్చిందని.. అలాంటి పరిశ్రమను నిలబెట్టుకోలేక యాజమాన్యంపై బెదిరింపులకు దిగుతున్నారని పార్థసారథి మండిపడ్డారు. కియాకు అందించే 12 అనుబంధ పరిశ్రమలు తమిళనాడులోని కృష్ణగిరికి తరలిపోయినట్లు ఆయన చెప్పారు. జగన్ ఏవిధంగా నేరాలు చేశారో..అదే తీరులోనే పరిపాలన సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. పింఛన్లు తొలగించిన బాధితులతో ఈనెల 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కియా పరిశ్రమ తరలింపుపై తెదేపా నేతల ఆగ్రహం - Theta leaders are angry over the move of Kia industry news
అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి కియా మోటర్స్ పరిశ్రమను తరలిపోవటానికి సిద్ధమైందని తెదేపా మాజీ ఎమ్యెల్యే పార్థసారథి ఆరోపించారు. కియా పరిశ్రమ మాజీ సీఎం కృషి వల్లనే అనంతపురం జిల్లాకు వచ్చిందని అన్నారు.
కియా పరిశ్రమ తరలింపుపై..తెదేపా నేతల ఆరోపణ