Industrie Subsides: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక రాయితీ సొమ్ము ‘అందని ద్రాక్ష’లా మారింది. యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (ఎంఎస్‌ఎంఈ) కింద రాయితీ సొమ్ము ఇవ్వాలని సంకల్పించారు. వడ్డీ, పెట్టుబడి, విద్యుత్తు, అమ్మకపు పన్ను, స్టాంపు డ్యూటీ.. ఇలా వివిధ రూపాల్లో నిర్దేశిత పరిశ్రమ యజమానికి రాయితీ రూపంలో ప్రోత్సాహకం చెల్లించాల్సి ఉంది. అయితే పలువురికి ఎనిమిదేళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 6,565 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 6,496 ఉండగా, మెగా, లార్జ్ పరిశ్రమలు 69 చొప్పున ఉన్నాయి. వ్యవసాయం, ఖనిజ, పశుసంపద, వస్త్ర, సేవారంగం, ఆటోమొబైల్స్, డిమాండు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లో ఏకగవాక్ష విధానం (సింగిల్ విండో) ద్వారా అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారు. దీంతోపాటు రాయితీ ఇచ్చి ప్రోత్సహించాల్సి ఉంది.
Industries Subsides:పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఏవప్పా? - ananthapuram district news
Industries Subsides: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక రాయితీ సొమ్ము ‘అందని ద్రాక్ష’లా మారింది. యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (ఎంఎస్‌ఎంఈ) కింద రాయితీ సొమ్ము ఇవ్వాలని సంకల్పించారు. వడ్డీ, పెట్టుబడి, విద్యుత్తు, అమ్మకపు పన్ను, స్టాంపు డ్యూటీ.. ఇలా వివిధ రూపాల్లో నిర్దేశిత పరిశ్రమ యజమానికి రాయితీ రూపంలో ప్రోత్సాహకం చెల్లించాల్సి ఉంది. అయితే పలువురికి ఎనిమిదేళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు.
రూ.1,049.73 కోట్ల రాయితీలో..
జిల్లాలో 1,749 మంది ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు 5,235 క్లెయిమ్‌ల ద్వారా రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.1,049.73 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014-15 నుంచి ఇప్పటి దాకా 4007 క్లెయిమ్‌లకు రూ.285.25 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 1,228 క్లెయిమ్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో 132 మాత్రమే పురోగతిలో ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. తక్కిన 861 క్లెయిమ్‌లను తిరస్కరించినట్లు లెక్క రాశారు. మరో 235 దరఖాస్తులను వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 371 మందికి రూ.43.39 కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
విడతల వారీగా చెల్లింపు
ప్రోత్సాహక రాయితీ సొమ్ము మంజూరులో జాప్యం ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ. అన్ని అర్హతలు కల్గిన వారికి మంజూరు చేస్తున్నాం. ఏవైన లోపాలు, సమస్యలు ఉంటే దరఖాస్తులను వెనక్కి పంపిస్తాం. ఈ ఏడాదిలోనే రూ.43.39 కోట్లు మంజూరు చేశాం. త్వరలో సమావేశం నిర్వహిస్తాం. తక్కిన వారికి కూడా రాయితీ సొమ్ము ఇస్తాం. - నాగరాజారావు, ఇన్‌ఛార్జి జీఎం, డీఐసీ