అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లిలో దొంగలు వరుస ఇళ్లల్లో చోరీలతో బీభత్సం సృష్టించారు. గ్రామంలో నివాసముండే రామచంద్ర అనే రైల్వే ఉద్యోగి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తుండగా దుండగులు ఇంట్లో ప్రవేశించి రూ. 30 వేల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
నాగరాజు అనే ప్రైవేటు వ్యాపారి ఇంట్లో చొరబడి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలతోపాటు ఒకటిన్నర కేజీ వెండి విగ్రహం, రూ.11 వేల నగదు అపహరించారు. మరో 2 ఇళ్లల్లోనూ చోరీలు చేశారు. అయితే ఇంటి యజమానులు లేకపోవటంతో ఎంత దోచుకెళ్లారనేది తెలియలేదని స్థానికులు తెలిపారు.