అనంతపురంజిల్లా మడకశిర మండలంలోని ఉప్పార్లపల్లి, భక్తరపల్లి గ్రామాల ఆలయాల్లో చోరీ జరిగింది. ఉప్పర్లపల్లిలో ఉన్న వేంకటేశ్వర స్వామి గుడి హుండీని పగలగొట్టిన దుండగులు, అందులోని నగదు దొంగిలించారు. భక్తరపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీదేవి దేవస్థానంలో సైతం ప్రవేశ ముఖద్వారాన్ని తెరిచేందుకు యత్నించారు. అది తెరుచుకోకపోవటంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఆలయాల్లో పలుమార్లు దొంగతనం జరిగినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా గ్రామాల్లో చోరీలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఉప్పార్లపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ - అనంతపురం జిల్లా వార్తలు
మడకశిర మండలంలోని ఉప్పార్లపల్లి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సమీపంలోని భక్తరపల్లి గ్రామంలోని ఆలయంలోనూ దోపడికి విఫల యత్నంచేశారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆలయంలో చోరీ