ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి.. పెద్దమ్మ ఆలయంలో చోరీ - ఈరోజు అనంతపురం జిల్లా పెద్దమ్మ ఆలయంలో చోరీ వార్తలు

ధర్మవరం పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్దమ్మ ఆలయంలో చోరీ జరగటం స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరాల సంబంధించిన తీగలను కత్తిరించిన దుండగులు.. అమ్మవారి హుండీ పగలగొట్టి సొమ్మును ఎత్తుకెళ్లారు.

Theft in Paddamma temple
పెద్దమ్మ ఆలయంలో చోరీ

By

Published : Jan 13, 2021, 3:05 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలోని జగజ్జీవన్​రామ్​నగర్ పెద్దమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయం తలుపులు పగలగొట్టి దుండగులు గుడిలోకి ప్రవేశించారు. హుండీ పగలగొట్టి అందులో ఉన్న సొమ్ము ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన స్థానికులు ధర్మవరం పట్టణ పోలీసులకు విషయం తెలియజేశారు. ఆలయ కమిటీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన తీగలను దుండగులు కత్తిరించారు. దీంతో చోరీ జరిగిన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే పట్టణ నడిబొడ్డున ఉన్న ఆలయంలో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది.

ABOUT THE AUTHOR

...view details