అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఓబులచారి రోడ్డులో ఉన్న మక్కా మసీద్, తహసీల్దార్ రోడ్లో ఉన్న జామియా మసీదులో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. హుండీల తాళాలు పగలగొట్టి నగదు అపహరించారు. మక్కా మసీదులోని హుండీలో రూ.40 వేలు, జామియా మసీదులోని హుండీలో రూ.లక్ష అపహరణకు గురైందని మసీద్ కార్యదర్శి సలావుద్దీన్ తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మసీదుల్లో చోరీ... రూ.లక్షన్నర నగదు మాయం - rayadurgam news updates
అనంతపురం జిల్లా రాయదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలోనే కాక, ప్రార్థనా మందిరాల్లోనూ దొంగతనాలు చేస్తున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదుల్లో దాదాపు రూ.లక్షన్నర నగదును దుండగులు అపహరించారు.
రాయదుర్గంలో దొంగతనానికి గురైన మసీదు