అనంతపురం జిల్లా గుంతకల్లులో సాయినగర్‌లోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటలకు యజమానురాలు వంట చేస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి వచ్చారు. బీరువాలో ఉన్న 17తులాల బంగారంతో పాటు రూ.30వేలు దోచుకెళ్లారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండవ పట్టణ సీఐ తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుంతకల్లులో చోరీ.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - gunthakallu latest news
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సాయినగర్‌లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంతకల్లులో చోరీ