పోలీసులు కరోనా నియంత్రణ విధుల్లో నిమగ్నమయ్యారు. లాక్‌డౌన్ నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 217 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరితో ప్రాథమిక కాంట్రాక్టు ఉన్న పోలీసులు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దొంగలు విజృంభిస్తున్నారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు. అనంతపురం పొరుగు జిల్లాల్లోకి ఉత్తరాది రాష్ట్రాల ముఠాలు ప్రవేశించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగర, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఉండటంతో ప్రధాన రహదారులపై నిఘా ఉంది. దీంతో శివారు ప్రాంతాలపై దొంగలు దృష్టి సారించారు.
- ఆర్థిక ఇబ్బందులే..
కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అన్ని వర్గాలు బాగా చితికిపోతున్నాయి. గతంలో పాత నేరస్థులు కూలీ పనులు చేస్తూ.. జీవించేవారు. ప్రస్తుతం పనులు లేక వారు ఆర్థిక ఇబ్బందులతో చోరీల బాట పట్టే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో చోరీల నియంత్రణకు ‘'ఒక దొంగ- ఒక పోలీసు'’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో జిల్లాలో చోరీలు తగ్గాయి. కరోనా నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు.
- పాత నేరస్తులే..
జిల్లాలో పాత దొంగలు 2,250 మంది ఉన్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. అప్పట్లో దొంగలను సంస్కరించడానికి పోలీసులకు బాధ్యత అప్పగించారు. సంబంధిత పోలీసు దొంగపై నిఘా ఉంచి, ఉపాధి అవకాశాలు కల్పించేవారు. ప్రస్తుతం పాత దొంగలు తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అనంతపురం టీవీ టవర్, గుంతకల్లు భాగ్యనగర్‌కు చెందిన షికారీ పాత ముఠాలు చోరీల వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఏటీఎం కార్డు నంబరు చెప్పండి, ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారు. వీటిపైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
- చోరీల తీరిది..