అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే కాలనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగి అయిన సౌభాగ్యవతి.. రైల్వే కాలనీలోని వివి నగర్లో నివాసముంటుంది. సౌభాగ్యవతి ఇంట్లోలేని విషయం గమనించిన దొంగలు.. నివాసంలోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 20 తులాల వెండి రూ.45 వేల నగదును అపహరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
రైల్వే కాలనీలో చోరీ.. ఎనిమిది తులాల బంగారం అపహరణ
అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే కాలనీలో చోరీ జరిగింది. రైల్వే కాలనీలోని వివి నగర్లో సౌభాగ్యవతి అనే మహిళ ఇంట్లోకి దొంగలు చొరబడి 8 తులాల బంగారం, 20 తులాల వెండి రూ.45 వేల నగదును అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రైల్వే కాలనీలో చోరి.. ఎనిమిది తులాల బంగారం అపహరణ