అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బెస్త వాడలో చోరీ జరిగింది. శంకరయ్య, లక్ష్మీదేవి దంపతులు ఉదయం పనిమీద ఇంటికి తాళం వేసి పక్క ఊరికి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి.
లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ. 1 లక్ష 50 వేల నగదు, ఒక జత కమ్మలు, 13 తులాల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి. పోలీసులకు సమాచారం అందించడంతో... వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.