అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం జీనులకుంట గ్రామంలో.. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఆనంద్ రెడ్డి కుటుంబం.. వ్యవసాయపనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేని విషయాన్ని గుర్తించిన.. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 5 తులాల బంగారం, వెండి వస్తువులను అపహరించారు. పొలం వద్ద నుంచి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఇంటి తాళం తీసి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. లోనికి వెళ్లికి చూడగా.. బీరువా పగలగొట్టి ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. బంగారు ఆభరణాలు అపహరణ - అనంతపురంలో దొంగతనం వార్తలు
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం జీనులకుంట గ్రామంలో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు.. ఐదు తులాల బంగారం, వెండి వస్తువులను అపహరించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా గాండ్లపెంటలో చోరి