అనంతపురం జిల్లా మడకశిర మండలం భక్తరహల్లి గ్రామంలోని... శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో చోరి జరిగింది. దొంగలు ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. హుండీ పగలగొట్టి నగదును అపహరించారు. ఈ విషయాన్ని పూజారి ఆలయ ట్రస్టు సభ్యులకు తెలపగా... వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వెండి శఠగోపం, 400 గ్రాముల బంగారు తాళిబొట్టు, హుండీలోని సుమారు రూ.2లక్షల వరకు నగదు... చోరీకి గురైనట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.
మడకశిర శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో చోరి - ananthapur theft news
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని శ్రీ మహాలక్ష్మీ దేవస్థానంలో చోరి జరిగింది. వెండి శఠగోపం, బంగారు ఆభరణాలు అపహరించారు. హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు.

ఆలయ తలుపులు పగలగొట్టి లోపలిక ప్రవేశించిన దుండగులు
TAGGED:
ananthapur theft news