అనంతపురం జిల్లా చాపిరి గ్రామానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఈ నెల 16న కళ్యాణదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ అమ్మాయిని అదే గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని..విచారిస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. యువతి అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
యువతి అదృశ్యం..అనుమానిత వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు - women missing case news
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతి అదృశ్యం