ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్లకాగితాన్నైనా... కళాఖండంలా మార్చేయగలడు - painting

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు చిత్రలేఖనంతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఎవరి వద్ద శిక్షణ తీసుకోకుండానే అందమైన చిత్రాలను అలవోకగా గీసేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన ఓ పోటీలో జిల్లా స్థాయిలో ప్రతిభ చూపాడు.

చిత్రలేఖనం

By

Published : Aug 4, 2019, 9:32 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన సురేంద్ర ప్రకాశ్​కు చిన్నతనం నుంచే చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించక ఎవరి వద్ద శిక్షణ తీసుకోలేదు. సొంతగానే సాధన చేసి తనలోని ప్రతిభకు సానపెట్టాడు.

తెల్లకాగితాన్నైనా... కళాఖండంలా మార్చేయగలడు
ప్రస్తుతం బీటెక్ చేస్తున్న సురేంద్ర చదువుతో పాటు చిత్రలేఖనంపై దృష్టి సారిస్తున్నాడు. ఇప్పటివరకు వివిధ రకాల చిత్రాలను గీశాడు. వాటిల్లో దేవుళ్లు, ప్రకృతి అందాలు, సైన్స్ సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. తన చిత్రాలతో చూపరులను కట్టిపడేయగలడు. వారి ఇంటిలో ఎక్కడ చూసినా సురేంద్ర గీసిన చిత్రాలే కనిపిస్తాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు. దాతలు ప్రోత్సహిస్తే తన ఊరికి, జిల్లాకి మంచి పేరు తెస్తానని అంటున్నాడు ఈ యువ కళాకారుడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details