అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు తనపై అక్రమ కేసు బనాయించారనే ఆరోపణతో మనస్థాపానికి గురై మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ బాటిల్తో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతని వద్ద నుంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు.
మడకశిర పోలీస్స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం - young man committed suicide at anantapuram district news
తనపై అక్రమ కేసు బనాయించారంటూ మనస్థాపం చెందిన ఓ యువకుడు మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ఆక్రమంగా మద్యం కేసులో తనను ఇరికించారంటూ ఆరోపించాడు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొద్దిరోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. తన ఇంటి ముందు మద్యం బాటిల్ దొరకడంతో.. ఇళ్లు మొత్తం సోదా చేసి బలవంతంగా తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, మద్యం కేసు నమోదు చేశారని ఆరోపించాడు. దీంతో తన పెళ్లి ఆగిపోయిందని మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు యువకుడు పేర్కొన్నాడు.
ఇవీ చూడండి...