YCP Leaders: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య రోజు రోజుకి వర్గ పోరు అధికమవుతోంది. తాజాగా ఒంటిమిది గ్రామంలో వైసీపీ సీనియర్ కార్యకర్త ఎర్రి స్వామి ఇంటికి ఎంపీ తలారి రంగయ్య భోజనానికి వచ్చాడు. అయితే ఆయన కడుతున్న ఇంటిని కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అనంతలో వైసీపీ నేతల మధ్య రోజు రోజుకి పెరుగుతున్న వర్గ పోరు - వైసీపీ ఎంపీ తలారి రంగయ్య
YCP Leaders: రోజు రోజుకి వైసీపీ నేతల మధ్య వర్గ పోరు అధికమవుతోంది. తాజాగా ఒంటిమిది గ్రామంలో వైసీపీ సీనియర్ కార్యకర్త ఎర్రి స్వామి ఇంటికి ఎంపీ తలారి రంగయ్య భోజనానికి వచ్చిన కారణంగా వైసీపీ వర్గాల మధ్య పోరు మొదలెైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగింది.
దీంతో ఆగ్రహించిన ఎర్రి స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫణికుమార్ కి ఫోన్ ద్వారా అనుచితంగా మాట్లాడాడని.. 19 మంది మంత్రి ఉషశ్రీ చరణ్ వర్గానికి చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎర్రి స్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబాన్ని కులాన్ని, కుటుంబ సభ్యులను, మహిళలను దుర్భాషలాడాడని తెలిపారు. వెంటనే ఎర్రి స్వామి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఫణికుమార్ కౌన్సిలర్లు అంతా కలిసికట్టుగా వెళ్లి ఎర్రిస్వామిపై డీఎస్పీ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: