అనంతపురం జిల్లా కుందుర్పిలో రెవెన్యూ అధికారులను గ్రామస్థులు నిర్భందించారు. తూముకుంట గ్రామానికి చెందిన చేనేతలకు సంబంధించిన పించన్లు రద్దయ్యాయి. దీనిపై సంబంధింత అధికారులను అడిగినా సరైన సమాధానం రాలేదు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లెవాసులు వారిని గ్రామసచివాలయంలో బంధించారు. మరికొంతమంది యువకులు... వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. జాబితాలో తమ పేర్లు నమోదు చేసే వరకు ఆందోళన చేస్తామన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిపై ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులను విడిపించారు.
పింఛన్ తొలగించారని అధికారులనే నిర్బంధించారు - అనంతపురం జిల్లా కుందుర్పిలో అధికారులను బంధించిన గ్రామస్తులు
కుందిర్పి మండలం తూముకుంట గ్రామ చేనేతల పింఛన్ తొలగించారని ప్రజలు ఆందోళన చేపట్టారు. పల్లెకు వచ్చిన అధికారులను నిర్బంధించారు.

అధికారులను బంధించిన గ్రామస్తులు