అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన రైతు తిప్పాయ సంవత్సరం క్రితం వ్యవసాయ పనులు కోసం లక్షన్నర పెట్టి రెండు ఎద్దులను కొనుగోలు చేశాడు. పశువుల పాకలో కట్టేసిన ఎద్దులను తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. మినీ ట్రక్కులో ఎద్దులను ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తమకు ఆ రెండు ఎద్దులే జీవనాధారమని.. ఇప్పుడు ఎలా బ్రతికేదని రైతు తిప్పాయ, అతని భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఎద్దులను ఎత్తుకెళ్లిన దుండగులు.. జీవనాధారం కోల్పోయిన దంపతులు - ఉరవకొండలో ఎద్దులను ఎత్తుకెళ్లిన దుండగులు వార్తలు
రైతు కన్నీరు దేశానికి మంచిది కాదంటారు. కానీ కొందరు దుండగులు చేసిన పనికి ఆ రైతు కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి వ్యవసాయ పనులకోసం కొన్న రెండు ఎద్దులను కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో తమకు జీవనాధారం పోయిందని ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎద్దులను ఎత్తుకెళ్లిన దుండగులు
ఇవీ చూడండి...:దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి