వర్ష బీభత్సం... మామిడి రైతుకు తీవ్ర నష్టం
గుత్తి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వర్షానికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం కలిగింది.
వర్ష భీభత్సం...మామిడి రైతుకు తీవ్ర నష్టం
అనంతపురం జిల్లా గుత్తిలో కురిసిన వడగండ్ల వర్షానికి అన్నదాత కుదేలయ్యాడు. మండలంలోని ఊటకల్లు గ్రామంలో ఉరుములు, మెరుపులతో భారీ వడగండ్ల వర్షం కురవడంతో పెద్దపెద్ద వృక్షాలు నేలకులాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షంతో సుమారు 15 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షం తమకు తీవ్ర నష్టం కలిగించిందని... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:సమయం దాటింది.. రేషన్ బందయ్యింది
Last Updated : Apr 26, 2020, 12:03 AM IST