అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మాలవీధిలో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తి తమ ఇంటి వెనుకవైపు నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని లక్ష రూపాయల నగదు.. 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూడగానే... బీరువాలోని బట్టలు చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు - dongalu_chori
ఇంటి తాళాలు ధ్వంసం చేసి లక్ష రూపాయల నగదు, 3 తులాల బంగారం, 12 తులాల వెండిని దోచుకెళ్ళిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.
ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు
TAGGED:
dongalu_chori