అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణంలో సుడిగాలి వయ్యారాలు ఒలకబోస్తూ నేలను తాకేలా అద్భుత ఆకారంలో దర్శనమిచ్చింది. పెద్ద శబ్దంతో గాలి సుడులు తిరుగుతూ పైకి లేవడంతో దాన్ని తిలకించేందుకు గ్రామస్థులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరారు. పాఠశాల మైదానంలో కొన్ని అడుగుల దూరం పాటు దుమ్ము పైకి ఎగిరిన ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు.
వింతదృశ్యం.. భానుడు దుమ్మును ఆకర్షిస్తున్నాడా..! - అనంతపురం జిల్లాలో అకట్టుకున్న వింత దృశ్యం
అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఓ దృశ్యం విద్యార్థులను ఆకట్టుకుంది. ఈ వింతను చూసిన విద్యార్థులు ఆశ్చర్యంతో కేరింతలు కొట్టారు. మరి ఆ వింతేంటో మనమూ చూసేద్దామా..!
విద్యార్థులను ఆకట్టుకున్న వింత దృశ్యం