..
ధర్మవరంలో బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ - ధర్మవరంలో బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ
గౌతమ బుద్ధుడు త్యాగానికి ప్రతిరూపమని శ్రీ సత్య సాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు భిక్షమయ్య గురూజీ అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, సత్యసాయి ధ్యానమండలి సభ్యులు పాల్గొన్నారు.
ధర్మవరంలో బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ