ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాలు చెల్లించాలంటూ ఎస్ఆర్​పీ కార్మికుల ఆందోళన - ఎస్ ఆర్ పి కార్మికులు ఆందోళన

బకాయి వేతనాలు చెల్లించాలంటూ ఎస్ఆర్​పీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన 4 నెలల వేతనం ఖాతాల్లో జమ చేయాలని నినాదాలు చేశారు. అధికారులు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని కోరారు.

workers protested
ఎస్ ఆర్ పి కార్మికులు ఆందోళన

By

Published : Oct 12, 2020, 7:08 PM IST

తమకు రావాల్సిన నాలుగు నెలల వేతనం బకాయిలను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని ఎస్ఆర్​పీ (శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం) కార్మికులు ఆందోళన చేపట్టారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలను కూడా తమకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన... మంచినీటి పథకం లో పనిచేసే కార్మికులు.... కళ్యాణదుర్గం ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు హామీ ఇచ్చిన మేరకు ప్రతి నెలా తమ ఖాతాల్లో వేతనాలను వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details