మానసిక స్థితి సరిగా లేని కుమారుడు కన్నతల్లిని కడతేర్చిన వైనం అనంతపురంజిల్లా గుంతకల్లులోని తిలక్‌నగర్ కాలనీలోని చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ కాసీం సాబ్ పరిశీలించారు. తిలక్‌నగర్‌కు చెందిన సంజమ్మ, చిన్న కుమారుడు శ్రీనివాసులుతో జీవనము సాగిస్తున్నారు. నిందితుడి తండ్రి రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తించగా తండ్రి మరణించడంతో ఆరుమసాల నుంచి కర్ణాటకలోని జిందాల్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి పనిపాట లేకుండా ఇంట్లోనే ఉన్నాడు. కారుణ్య నియామక పద్ధతి ప్రకారం ఇంట్లోని పెద్ద కుమారుడికి రైల్వే ఉద్యోగం రావటంతో మనస్థాపానికి గురైన నిందితుడు తల్లికి వచ్చే పింఛను సొమ్ము మీదే ఆధారపడేవాడు. తన రోజువారి ఖర్చులకు ఇంట్లో వారితో గొడవపడే వాడు. రోజూలాగానే అమ్మతో గొడవపడి కోపంతో రగిలిపోతూ వేట కొడవలితో విచక్షణరహితంగా 16 చోట్ల నరికి అమ్మని చంపేశాడు. నిందితుడు నరికిన కత్తిని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందగా గుంతకల్లు డీఎస్పీ కాసీం సాబ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు బృందం నిందితుడి కోసం గాలిస్తున్నదని త్వరలోనే అతన్ని పట్టుకుని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి:
కొడవలితో 16 వేట్లు వేసి తల్లిని చంపిన తనయుడు
కనికరం లేని కుమారుడు కన్నతల్లిని దారుణంగా వేట కొడవలితో 16 చోట్ల నరికి చంపేశాడు. కారణం మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం. తల్లిని కనిపెట్టుకుని ఉండాల్సిన కుమారుడే కడతేర్చడంటూ..కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరగ్గా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
16 చోట్ల వేట కొడవలితో నరికి..కన్న తల్లిని కడతేర్చిన కశాయి కొడుకు
Last Updated : Sep 29, 2019, 9:43 AM IST