240 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులతో అనంతపురం నుంచి ఢిల్లీకి రెండో కిసాన్ రైల్ ప్రారంభమైంది. ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు జెండా ఊపి రైలును ప్రారంభించారు. 210 మెట్రిక్ టన్నుల టమోటా, 24 మెట్రిక్ టన్నుల బొప్పాయి, 3.5 మెట్రిక్ టన్నుల మామిడి, 2.5 మెట్రిక్ టన్నుల దానిమ్మ ఉత్పత్తులతో మొత్తం 240 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులతో కిసాన్ రైలు తరలి వెళ్లింది. దీని ద్వారా 10 వ్యాగన్లు ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు, 2 వ్యాగన్లు ద్వారా నాగపూర్ మార్కెట్ కు ఉద్యాన ఉత్పత్తులను తరలిస్తారని అధికారులు తెలిపారు.
అనంత నుంచి రెండో దఫా కిసాన్ రైలు పరుగులు - Kisan train started from Anantapur to Delhi latest news
అనంతపురం నుంచి ఢిల్లీకి రెండో దఫా కిసాన్ రైలు పరుగులు తీసింది. 240 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులతో శనివారం అర్ధరాత్రి సమయంలో పీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారాయుడు జెండా ఊపి రైలును ప్రారంభించారు.
అనంత నుంచి రెండో దఫా కిసాన్ రైలు పరుగులు