అనంతపురం జిల్లా కదిరిలో గజ్జలరెడ్డిపల్లి కాలనీలో ఒక వ్యక్తి పాఠశాల భవనం కోసం తన భూమిని ప్రభుత్వానికి దానం చేశారు.అధికారులు ఈ భూమిని పట్టించుకపోవటంతో,దీన్ని ఆసరాగా తీసుకున్న మరో వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మేశాడు.విషయం తెలుసుకున్న మున్సిపల్,రెవిన్యూ అధికారులు సదరు భూమిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.ఆ స్థలానికి రక్షణ కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే,ఈ ఘటన చోటుచేసుకుందని..ప్రజలు ఆందోళనకు దిగారు.
పాఠశాల కోసం దానమిచ్చిన భూమిని అమ్మేసుకున్న ఘనులు - kadiri school smash news
సమాజ శ్రేయస్సు కోసం ఓ వ్యక్తి, తన భూమిని ప్రభుత్వ పాఠశాలకు దానంగా ఇస్తే..మరో వ్యక్తి తన స్వార్దం కోసం ఆ భూమిని అమ్మేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆలస్యంగా కళ్లు తెరచిన మున్సిపల్,రెవెన్యూ అధికార్లు సదరు భూమిపై ఉన్నతాధికార్లకు నివేదిక పంపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది.
పాఠశాల స్థలాన్ని..కొట్టేశారు