నివర్ తుపాను కారణంగా అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తారు. నీటిని దిగువకు విడుదల చేయడంతో యల్లనూరు మండలం తిమ్మంపల్లి-శింగవరం గ్రామాల మధ్య రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తాడిపత్రి నుంచి తిమ్మంపల్లి, శింగవరం మీదుగా పులివెందుల వెళ్లాల్సిన వాహనాలను అధికారులు దారి మళ్లించారు. రోడ్డు కోతకు గురైన ప్రదేశంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
తిమ్మంపల్లి-శింగవరం మధ్య కోతకు గురైన రోడ్డు - శింగవరంలో కోతకు గురైన రోడ్డు
నివర్ తుపాను కారణంగా అనంతపురం జిల్లాలో భారీవర్షాలు కురవగా..వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో.. తిమ్మంపల్లి-శింగవరం గ్రామాల మధ్య రోడ్డు కోతకుగురై..రాకపోకలకు అంతరాయం కలిగింది.
కోతకు గురైన తిమ్మంపల్లి- శింగవరం గ్రామాల మధ్య రోడ్డు