అనంతపురం జిల్లా పెనుగొండలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు... జ్వరాల బారినపడ్డారు. దీనిపై "ఆసుపత్రి పాలైన గురుకుల పాఠశాల విద్యార్థునులు" శీర్షికన ''ఈటీవీ భారత్''లో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన ఏటీడబ్ల్యూఓ యశోదమ్మా... గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో సమస్యలపై చర్చించారు. జ్వరాలు రావడానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి పాఠశాలలో విద్యార్థులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని యశోదమ్మా చెప్పారు. ఇటీవల మంజూరైన రూ.20లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు.
''ఈటీవీ భారత్'' కథనానికి స్పందన... విషజ్వరాలపై ఆరా - Etv bharat article in penukonda news at ananthapur
పెనుగొండలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో... ఏఎన్ఎం విద్యార్థులు విషజ్వరాల బారినపడ్డారు. దీనిపై ''ఈటీవీ భారత్''లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఏటీడబ్ల్యూఓ యశోదమ్మా విషజ్వరాలపై ఆరాతీశారు.
![''ఈటీవీ భారత్'' కథనానికి స్పందన... విషజ్వరాలపై ఆరా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5064237-753-5064237-1573738483964.jpg)
పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఏటీడబ్ల్యూఓ యశోదమ్మా
Last Updated : Nov 14, 2019, 7:48 PM IST