అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రానికి అవసరమైన స్థలాన్ని సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి దానంగా ఇచ్చారు. ఐదున్నర సెంట్ల స్థలాన్ని వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరినాయక్ చదును చేయించారు. ఆర్బీకే నిర్మాణానికి విలువైన భూమిని దానంగా ఇచ్చిన సత్యనారాయణను అధికారులు అభినందించారు.
రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి భూదానం.. - Farmer Assurance Center news
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేస్తోంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలో ఆర్బీకే నిర్మాణానికి ఓ వ్యక్తి స్థలం దానం చేశారు.
ఆర్బీకే నిర్మాణానికి దానం చేసిన స్థలం