అనంపురం ప్రజలకు ఆధార్ పోందటంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి ఆధార్ కార్డు కేంద్రాల చుట్టూ తిరిగిన కనీసం టోకెన్లు కూడా దొరకటం లేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, కొత్త రేషన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రజలు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనంత ప్రజలకు ఆధార్ సమస్యలు..! - anantapur updates
అనంతపురం ప్రజలకు ఆధార్ సమస్యలు తప్పడంలేదు. రోజుల తరబడి ఆధార్ కార్డు కేంద్రాల చుట్టూ తిరిగినా... కనీసం టోకెన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించాలని ప్రజలు కొరుతున్నారు.
అనంత ప్రజలకు ఆధార్ సమస్యలు