రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి.. ప్రజలు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా.. అనంతపురం నగరంలోని సరోజిని రోడ్డులో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులు శ్రీకాంతం శ్యామమూర్తిని కలెక్టర్ సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని.. జీవితంలో ముందుకు సాగాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా ప్రతీవారం వివిధ కార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
'రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు ప్రజలు కృషి చేయాలి' - అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
స్వాతంత్ర సమరయోధుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని.. జీవితంలో ముందుకు సాగాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రజలు కృషి చేశారు.
రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రజలు కృషిచేయాలి
TAGGED:
కలెక్టర్ గంధం చంద్రుడు