అనంతపురం నగర శివారులో అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. నగర శివారు గుత్తి రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రౌడీ షీటర్ షేక్ సికిందర్ అనే వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మద్యం మత్తులో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తనతోపాటు ఉన్న రౌడీషీటర్లైన మిత్రులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
murder: రౌడీ షీటర్ హత్య.. సన్నిహితులే కారణం అని అనుమానం - latest news in anantapur district
ఓ రౌడీ షీటర్ని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేశారు. అనంతపురంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
murder