అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంస్థలో వివాదాల నడుమ ఎట్టకేలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తాడిపత్రి మున్సిపాలిటీలో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా వైకాపా వర్గీయులు అడ్డుకోవటంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం గేటు సమీపంలో కూర్చోవటంతో తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయటానికి భయపడ్డారు. మరికొంతమంది వైకాపా వర్గీయులు ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోనే తిష్టవేసి తెదేపా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెదేపా కార్యకర్తలు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటంతో.. ఆయన పురపాలక సంఘం వద్దకు చేరుకున్నారు.
ఇరువర్గాలను బయటకు పంపించిన పోలీసులు