అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రాంపురం గ్రామం వద్ద సుధాకర్ అనే రైతుకు చెందిన మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లికి చెందిన సుధాకర్... రాంపురం వద్ద మామిడి సాగు చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట నాటిన మామిడి మొక్కలకు ఉపాధి హామీ పథకం ద్వారా నీరు పోసి సంరక్షణ చేస్తున్నాడు. గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి చెట్లు నరికివేశారని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. రైతు సుధాకర్ ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులకు కేసు నమోదు చేసి ఎస్ఐ జనార్ధన్ నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యక్తిగత విభేదాల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
మామిడి చెట్లు నరికేసిన గుర్తుతెలియని వ్యక్తులు - mango trees cutdown latest news
సుధాకర్ అనే రైతు మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు.
మామిడి చెట్లు నరికేసిన గుర్తుతెలియని వ్యక్తులు