అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దాపురంలో కేశవ అనే రైతు తన పొలంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. నీరు వేసేందుకు వెళ్లి స్టార్టర్ వేసే సమయంలో విద్యుత్ షాక్ కి గురై అక్కడికక్కడే మరణించాడు.
వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగించే రైతు మృతి చెందిన కారణంగా ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వమే వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. కేశవకు 2 లక్షల పైగా అప్పులు ఉన్నాయని కుటుంబీకులు చెప్పారు.