ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మల్కాపురంలో హత్య కేసు.. ప్రధాన నిందితుడు అరెస్టు - మల్కాపురం హత్య కేసులో నిందితుడు అరెస్టు వార్తలు

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురం గ్రామంలో ఈనెల 7న జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

accused in police custody
పోలీసుల అదుపులో నిందితుడు

By

Published : Jun 11, 2021, 8:21 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్కాపురం గ్రామంలో ఈనెల 7న గొల్ల గోపాల్​ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసులును అరెస్టు చేసినట్లు రాయదుర్గం సీఐ ఈరన్న, ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మద్యానికి బానిసైన శ్రీనివాసులు... డబ్బు కోసం స్నేహితులు, గ్రామస్థులను వేధించేవాడని చెప్పారు. "గ్రామానికి చెందిన గోపాల్​ను మద్యం తీసుకురావాలని శ్రీనివాసులు కోరాడు. మద్యం తీసుకురాలేదని గోపాల్​పై కోపంతో... అతన్ని రాళ్లతో కొట్టి, కాళ్లతో తన్ని హతమార్చారు" అని సీఐ తెలిపారు.

మృతుడి భార్య రేణుకమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మండలంలోని కాంచనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచారణ కోసం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details