అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల పేట శివయ్య అనే గొర్రెల కాపరికి చెందిన 40 గొర్రె పిల్లలు అగ్నికి ఆహుతయ్యాయి. గొర్రెలు మేతకు వెళ్లడం వల్ల వాటి పిల్లల్ని గొర్రెల గూడులోనే వదిలేశాడు. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టటంతో అవి అక్కడిక్కడే మృతి చెందాయి. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
గొర్రెపిల్లలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. కొందరు దుండగులు నిప్పు పెట్టడం వల్ల గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
గొర్రెపిల్లలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు